టిఆర్ఎస్ నేత మృతి.
జనం వాయిస్, భూపాలపల్లి:
భూపాలపల్లి కి చెందిన సీనియర్ టిఆర్ఎస్ నాయకుడు మాజీ కోఆప్షన్ సభ్యుడు బిబి చారి (60) సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన చారి మృతితో పట్టణంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. ఆయన భార్య వజ్రమని గతంలో 16వ వార్డు కౌన్సిలర్ గా సేవలందించారు. చారి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.