మంథనిలో లారీ బీభత్సం.. యువకుడు మృతి.
- లారీ చక్రాల కింద పడి మల్లెపల్లి యువకుడి దుర్మరణం.
జనం వాయిస్, మంథని, అక్టోబర్ 25:
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని పాత పెట్రోల్ పంప్ సమీపంలో లారీ ఢీకొనడంతో మల్లెపల్లి గ్రామానికి చెందిన చింతల నవీన్ (28) లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద తీవ్రతకు యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆకస్మిక మృతితో మల్లెపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.