మంథనిలో లారీ బీభత్సం.. యువకుడు మృతి.

మంథనిలో లారీ బీభత్సం.. యువకుడు మృతి. లారీ చక్రాల కింద పడి మల్లెపల్లి యువకుడి దుర్మరణం. జనం వాయిస్, మంథని, అక్టోబర్ 25:పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని పాత పెట్రోల్ పంప్ సమీపంలో లారీ ఢీకొనడంతో మల్లెపల్లి గ్రామానికి చెందిన చింతల నవీన్ (28) లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద తీవ్రతకు యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు....