janamvoice.com
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 7:22 pm Digital Edition : GATTU MAHESH

తెలంగాణ రాజ్ భవన్ పేరు మార్పు..!

తెలంగాణ రాజ్ భవన్ పేరు మార్పు..!

జనం వాయిస్,హైదరాబాద్,డిసెంబర్ 02:

తెలంగాణ రాజ్ భవన్ పేరు మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది,రాజ్ భవన్ పేరు లోక్ భవన్ గా పేరు మార్చింది, గవర్నర్ల అధికారిక నివాసాలకు పేరు మార్చాలని కేంద్రం రాష్ట్రాల కు సూచించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వా ళ ఈ నిర్ణయం తీసుకుంది.. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది….
అందులో భాగంగా.. గవర్న ర్‌ల అధికారిక నివాసాలైన రాజ్ భవన్ పేర్లను ఇకపై లోక్ భవన్‌గా పిలవనున్నా రు..ప్రజా సేవ’ అనే ప్రభుత్వ నినాదానికి అనుగుణంగా ఈ మార్పు చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది.. దీనికి అనుగుణంగా.. కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన చేసింది..
దేశవ్యాప్తంగా గవర్నర్ల అధికారిక నివాసం, కార్యాలయ భవనంగా ఉన్న ‘రాజ్ భవన్’ పేరును ‘లోక్ భవన్’గా మార్పు చేస్తున్నట్లు గత నెల 25వ తేదీన జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది.. దేశంలో ఎక్కడా ‘రాజ్ భవన్’ అనే పదం అధికారికంగా ఉపయో గించరాదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.
రాజ్యాంగంలో గవర్నర్ పదవి రాజన్యతకు ప్రతీక కాదని, ప్రజల ప్రతినిధిగా పనిచేసే వ్యవస్థ అనే ఉద్దేశంతో ‘లోక్ భవన్’ అంటే.. ప్రజల భవనం గా కొత్త పేరును ఎంచుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ఈ మార్పు ద్వారా రాజ్యాం గ గణతంత్ర విలువలను మరింత బలపరుస్తున్నట్లు పేర్కొంటున్నారు..