జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.-టీయుడబ్ల్యూజె ఐజెయు ఆద్వర్యంలో ధర్నా. జనం వాయిస్, పెద్దపల్లి: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయుడబ్ల్యూజే ఐజెయు జిల్లా శాఖ ఆద్వర్యంలో శనివారం పెద్దపల్లి బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్ర కమిటీ ఆద్వర్యంలో డిసెంబర్ 3న హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన మహా ధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు. జర్నలిస్టులకు తక్షణమే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, ఆరోగ్య భీమా పథకాన్ని పునరుద్ధరించాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, వృత్తి కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు....