janamvoice.com
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 2:15 pm Digital Edition : GATTU MAHESH

అడవిశ్రీరాంపూర్ టూ మేడారం ప్రత్యేక బస్సులు నడిపించాలి.

అడవిశ్రీరాంపూర్ టూ మేడారం ప్రత్యేక బస్సులు నడిపించాలి.

– డిపో మేనేజర్ ను కోరిన ఉపసర్పంచ్ అనవేన హరిత-తిరుపతి.

జనం వాయిస్, ముత్తారం:

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామం నుండి ఆసియా ఖండంలోనే అతిపెద జాతర  అయినటువంటి కుంభమేల మేడారం మహా జాతరకు ప్రత్యేకంగా అదనపు బస్సులు నడిపించాలని గ్రామ ఉప సర్పంచ్ అనవేన హరిత తిరుపతి లు సోమవారం మంథని డిపో మేనేజర్ ను కలిసి వినతిపత్రం అందించారు.మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు మా గ్రామం నుండి అధిక సంఖ్యలో భక్తులు వెళ్తారని ఈ సందర్భంగా మా గ్రామ ప్రజల సౌకర్యార్థం అడవి శ్రీరాంపూర్ గ్రామం నుండి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు, అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయవలసిందిగా కోరినట్లు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు ప్రయాణించడానికి ఈ బస్సు సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఉప సర్పంచ్ ఆలోచన పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.