యూపీఐకి షాక్ సిద్ధం..! ఇకపై లావాదేవీలకు ఛార్జీలేనా..?
యూపీఐకి షాక్ సిద్ధం..! ఇకపై లావాదేవీలకు ఛార్జీలేనా..?జనం వాయిస్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యూపీఐ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. రోడ్డు పక్కన చిన్న దుకాణాల నుంచి పెద్ద షాపింగ్ కేంద్రాల వరకు ప్రతిచోటా నగదు లేకుండానే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు యూపీఐ ద్వారా లావాదేవీలు పూర్తిగా ఉచితంగా సాగుతున్నప్పటికీ భవిష్యత్తులో ఛార్జీలు విధించే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి.యూపీఐ సేవలను నిర్వహించేందుకు భారీ ఖర్చులు అవుతున్నాయని ఫిన్ టెక్ సంస్థలు చెబుతున్నాయి. సాంకేతిక మౌలిక సదుపాయాలు, సర్వర్ల నిర్వహణ, భద్రతా వ్యవస్థలు, మోసాల నివారణ, వినియోగదారుల...