భారంగా కూరగాయల ధరలు..!
కూరగాయల ధరలు మంట..!జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 16: సామాన్యుల వంటింట్లో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగి భారంగా మారాయి. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న ధరలు అకాల వర్షాలు, వేసవి తీవ్రత కారణంగా పెరిగి వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంటలు దెబ్బతినడంతో మార్కెట్‌కు సరఫరా తగ్గిపోవడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.హైదరాబాద్‌లోని ప్రధాన రైతు బజార్లలో ధరలు గణనీయంగా పెరిగాయి. ఇటీవల వరకు కిలో రూ.10 వద్ద లభించిన టమాటా ధర ఇప్పుడు రూ.23కు చేరింది. అలాగే బీన్స్ కిలో రూ.60,...