janamvoice.com
Newspaper Banner
Date of Publish : 12 November 2025, 10:43 am Digital Edition : GATTU MAHESH

నేడు వేములవాడ ఆలయంలో దర్శనాల నిలిపివేత

నేడు వేములవాడ ఆలయంలో దర్శనాల నిలిపివేత

జనం వాయిస్,రాజన్న జిల్లా నవంబర్12:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో బుధవారం భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అధికారులు ముందస్తు ప్రకటన లేకుండా దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆలయం ఎదుట స్వామివారి దర్శనం కోసం ఈరోజు తెల్లవారుజామున భక్తులు నిరీక్షించారు. ఆలయ ప్రధాన గేటుకు కూడా అధికారులు తాళం వేయడంతో భక్తులు అసహ నం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన గేటు నుంచి ఆల యం లోపలికి వెళ్లకుండా అడ్డంగా రేకులు ఏర్పాటు చేశారు అధికారులు.ఈ నేపథ్యంలో భక్తులు ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు.అయితే, దక్షిణ కాశీగా విరుజిల్లుతున్న వేముల వాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అభివృద్ధి పనులు కొనసాగుతున్న కారణంగా బుధవారం రాజన్న దర్శనాలను ఆలయ అర్చక బృందం అధికార యంత్రాంగం నిలిపివేశారు.. రాజన్న ఆలయం ఎదుట ప్రచార రథంపై స్వామివారి దర్శనం ఎల్ఈడి స్క్రీన్ పై దర్శనం కల్పించారు.రాజరాజేశ్వరస్వామి దర్శనం కోసం తీవ్ర చలిలో  కుటుంబ సభ్యులతోఎంతో దూరం నుంచి వచ్చి స్వామివారికి మొక్కు చెల్లిందమని వస్తే ఆలయ అధికారులు ఇలా చేయడం భావ్యం కాదని భక్తులు మండిపడుతున్నారు.