వ్యవసాయానికి నీళ్లివ్వలేం.. ఆరుతడి పంటలే వేసుకోండి!
వ్యవసాయానికి నీళ్లివ్వలేం.. ఆరుతడి పంటలే వేసుకోండి! రైతులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన. 50 శాతం బోర్లు ఎండిపోయాయి.. తాగునీటికే తొలి ప్రాధాన్యం. రానున్న 8 నుంచి 10 నెలలు అత్యంత ప్రమాదకరం. జనం వాయిస్, హైదరాబాద్, అక్టోబర్ 23:రాష్ట్రంలో నెలకొన్న నీటి కొరత నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా కూరగాయలు, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయానికి సాగునీరు అందించడం సాధ్యం కాదని, అందుబాటులో ఉన్న నీటిని...