janamvoice.com
Newspaper Banner
Date of Publish : 27 December 2025, 1:05 pm Digital Edition : GATTU MAHESH

కస్తూరిబా లో అధునాతన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తా.

కస్తూరిబా లో అధునాతన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తా.

-20 లక్షలతో అదరపు తరగతి గది మరియు టాయిలెట్స్ ప్రారంభం..

-పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు.

జనం వాయిస్, పెద్దపల్లి :

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో₹ 20 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన అదనపు తరగతి గది మరియు టాయిలెట్స్ ను శనివారం రోజున పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే విజయరమణా రావు కి ప్రత్యేక అధికారి స్వప్న తో పాటు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. స్వాగత నృత్యంతో పాటు విద్యార్థినిలు చేసిన పిరమిడ్ను ఎమ్మెల్యే స్వయంగా వీక్షించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు  మాట్లాడుతూ..పెద్దపల్లి నియోజకవర్గంలో కస్తూరిబాగాంధీ పాఠశాలలో విద్యార్థులు చేరేందుకు వారి తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, సుల్తానాబాద్ మండలంలో ఉన్న కస్తూరిబా పాఠశాల నియోజకవర్గంలోని ప్రత్యేక స్థానం కలిగి ఉందని ఈ పాఠశాలలో చదువుతున్న 360 మంది విద్యార్థులకు అన్ని రకాల వసతులను కల్పించేందుకు కృషి చేస్తానని విద్యార్థులు 10వ, 12వ తరగతిలో చక్కటి ఫలితాలను తీసుకువచ్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయడం అభినందనీయమని అన్నారు.రానున్న విద్యా సంవత్సరంలో మరో కొంత మంది విద్యార్థుల శాతాన్ని  పెంచేందుకు కృషి చేయాలని అన్నారు. పాఠశాలలో మంచినీటి సౌకర్యంకు ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా త్వరలోనే మంచినీటి ఇబ్బందిని తొలగించేందుకు కృషి చేస్తానని తెలిపారు.అలాగే మరో 20 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదిల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు కొందరు పెడదారి పడుతున్నారని వారిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పూర్తిస్థాయిలో డ్రగ్స్ ను నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసి వాటిపై శ్రద్ధ వహిస్తున్నారని, రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా మాదకద్రవ్యాలను నిర్మూలించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పాఠశాలకు ఏ అవసరం వచ్చిన తనను సంప్రదించవచ్చని విద్యార్థుల విద్య కోసం ఎప్పుడు ముందుంటానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, భూపతిపూర్ సర్పంచ్ పోచంపల్లి చిన్నయ్య, శ్రీ రంగారావు, నరసయ్య పల్లి సర్పంచ్  తిరుమలరావు, నారాయణ రావు పల్లి సర్పంచ్ నామని రాజిరెడ్డి,గర్రెపల్లి సర్పంచ్ వీరగొని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలుక సతీష్, కల్లేపల్లి జానీ,  స్పెషల్ ఆఫీసర్ స్వప్న, కవిత,విజయేందర్ రెడ్డి, లతోపాటు ఉపాధ్యాయినీలు, విద్యార్థినిల తోపాటు పలువురు పాల్గొన్నారు.