ఫోన్ ట్యాపింగ్ బాధ్యులు ఎవరు.?
ఫోన్ ట్యాపింగ్ బాధ్యులు ఎవరు. *రిటైరైన ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌ను ఎందుకు కొనసాగించారు? - ఆ ఇద్దరు అధికారులూ తరచూ మిమ్మల్ని కలిసేవారా?. -కేసీఆర్‌కు ప్రశ్నలు సిద్ధం చేసిన సిట్. జనం వాయిస్, తెలంగాణ:ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్ విచారణ సిట్‌కు అత్యంత కీలకంగా మారనుంది. అనధికార, అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు బాధ్యులెవరన్న అంశాన్ని నిర్ధారించుకోవడానికి కేసీఆర్ విచారణను ఒక అవకాశంగా మలచుకోనుంది. ఇప్పటి వరకు అరెస్టు అయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఎస్‌ఐబీ అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలు విచారణలో అంగీకరించిన...