దేశంలోనే అతిపెద్ద ప్రాథమిక షేర్ విక్రయంగా రిలయన్స్ జియో రానుందా?
దేశంలోనే అతిపెద్ద ప్రాథమిక షేర్ విక్రయంగా రిలయన్స్ జియో రానుందా?జనం వాయిస్, న్యూఢిల్లీ: భారత షేర్ మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకు లేని స్థాయిలో భారీ ప్రాథమిక షేర్ విక్రయం త్వరలో రానున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ గ్రూప్‌కు చెందిన జియో ప్లాట్‌ఫాంలను 2026 సంవత్సరం తొలి అర్ధభాగంలో ప్రజల ముందుకు తీసుకురావాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ వార్తతో దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో భారీ ఆసక్తి నెలకొంది.గత సంవత్సరం రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ జియోను షేర్ మార్కెట్‌లో లిస్ట్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఆ...