గోదావరిఖని వైన్ షాపులో దొంగలు.
– సిసి పుటేజిని సైతం ఎత్తుకెళ్లిన దుండగులు.
జనం వాయిస్, గోదావరిఖని :
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కెట్ సమీపంలోని బాలాజీ వైన్స్ షాప్ లో దొంగలు పడ్డారు.అర్ధరాత్రి షాప్ వెనక నుండి దొంగలు చొరబడి విలువైన మద్యం బాటిళ్ల తోపాటు నగదును దోచుకెళ్లినట్లు యజమాని పేర్కొన్నారు.సిసి ఫుటేజ్ ని సైతం దొంగలు అపహరించినట్లు ఆయన చెప్పారు.నిత్యం రద్దీగా ఉండే ఏరియాలో దొంగలు పడడం పోలీసుల వైఫల్యాన్ని సూచిస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఠాణ కు వంద మీటర్ల దూరంలో ఉన్న వైన్స్ షాపులో దొంగలు పడడం పోలీస్ పెట్రోలింగ్ పనితీరును ప్రశ్నిస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు కాలనీలో గస్తీ నిర్వహించి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.దొంగలను త్వరితగతిన పట్టుకొని తమకు న్యాయం చేయాలని వైన్ షాప్ యజమానులు పోలీసులను వేడుకుంటున్నారు.