హుస్సేన్ సాగర్‌లో యువతి మృతదేహం కలకలం
జనం వాయిస్, హైదరాబాద్:
తెలంగాణ : హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో ఓ యువతి మృతదేహం కలకలం రేపింది.సాగర్‌లో నీటిపై తేలుతూ కనిపించిన యువతి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. 22 ఏళ్ల యువతిగా గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.