ప్రియుడి మృతి తట్టుకోలేక యువతి బలవన్మరణం.
జనం వాయిస్, సిద్దిపేట:
సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడని మనస్తాపంతో 18 ఏళ్ల ఆశని శ్రావణి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ పూర్తిచేసి కూలీ పనులకు వెళ్తున్న శ్రావణికి, దౌల్తాబాద్ మండలం మల్లేశంపల్లికి చెందిన కుమ్మరి మహేష్ అలియాస్ రసీం బాబాతో పరిచయం ఏర్పడింది. ఇటీవల మహేష్ మృతిచెందడంతో మనస్తాపానికి గురైన శ్రావణి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.