ముంబైలో బీసీ నాయకులచే యశోబుద్ధ క్యాలెండర్ ఆవిష్కరణ.
జనం వాయిస్, ముంబై:
ముంబైకి చెందిన ప్రఖ్యాత ఓ/బీసి నాయకులచే ఆర్మూర్ లో నిర్మించిన “యశోబుద్ధ -2026” క్యాలెండర్ ఘనంగా ఆవిష్కరణ జరిగింది. శుక్రవారం పశ్చిమ ఘట్కోపర్ లో “ఓ/బీసీల హక్కుల సాధన” అంశంపై స్థానిక పద్మశాలి, యాదవ, మహారాజ్, మాల తదితర కులస్తుల మధ్య సుధీర్గంగా చర్చ సాగింది. సభకు శ్రీమార్కండేయ పద్మశాలి సేవ సంఘం గావ్ దేవి అధ్యక్షులు డాక్టర్ శ్రీగాది లక్ష్మణ్ అధ్యక్షత వహించగా, తెలంగాణ నుంచి విచ్చేసిన ప్రత్యేక ఆహ్వానితులు పోర్ల లింగప్ప యాదవ్ హాజరైయ్యారు. ఈ సందర్బంగా యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో సాగుతున్న బీసీ ఉద్యమానికి ముంబైలోని ఓ/బీసీ ఎస్సి ఎస్టీ ప్రజలు సంఘీభావం తెలిపాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో సామల లక్ష్మన్ యాదవ్, దేవయ్య యాదవ్, గురుపాదం పద్మశాలి, తుమ్మల సుధీర్, కూన రాజగంగారాం, యానం బాబు, పరశురాం మహారాజ్, మదారి గణేష్, స్వామి, జక్కుల మల్లేష్ యాదవ్, కొండ రాజు పద్మశాలి, మూలనివాసి మాలజీ పాల్గొన్నారు. చివరిలో యశోబుద్ధ కాలమానిక విశిష్టతలు వివరించడం జరిగింది. తదుపరి సభ్యులందరు క్యాలండర్ ను సామూహికంగా ఆవిష్కరించారు.