janamvoice.com
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 4:54 pm Digital Edition : GATTU MAHESH

క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందజేసిన యువ నాయకులు పొట్ల శ్రీకాంత్.

క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందజేసిన యువ నాయకులు పొట్ల శ్రీకాంత్.

జనం వాయిస్, మంథని:

మంథని మండలానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకులు పొట్ల శ్రీకాంత్ వాలీబాల్ క్రీడాకారులకు కిట్ అందజేశారు. ఆదివారం మంథని మండలం ఆరెంద గ్రామ క్రీడాకారులకు మల్లారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ యువ నాయకులు పొట్ల శ్రీకాంత్ క్రీడా సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. క్రీడా నైపుణ్యంతో ప్రతి ఒక్కరు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. యువత అనుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆశించారు. ఈ కార్యక్రమంలో ఆరెంద గ్రామ యువజన నాయకులు గాడేపు కిరణ్, పొట్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.