గంజాయిని దేవుడికి ప్రసాదంగా పెట్టిన యువకులు.
– శంషాబాద్ ధర్మగిరి టెంపుల్ గంజాయి కలకలం.
జనం వాయిస్, రంగారెడ్డి:
బడంగ్ పేట్ కు చెందిన చరణ్ తో పాటు అతని స్నేహితులు శివరాత్రి సందర్భంగా శివుడికి గంజాయిని ప్రసాదంగా పెట్టారు. గంజాయిని ప్రసాదంగా పెట్టే వీడియోను తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. అందరూ కొబ్బరికాయ కొట్టేలాగా కాకుండా మేము ప్రత్యేకంగా గంజాయి పెడుతున్నామంటూ వీడియో తీసారు.
ఇంస్టాగ్రామ్ లో రీల్ హల్ చల్ కావడంతో నెటిజెన్లు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ కు ఫిర్యాదు చేసారు. దాంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. యువకులు బడంగ్పేట్ కు చెందిన వారిగా గుర్తించారు. యువకుల కోసం గాలిస్తున్నారు. ఇలాంటి రీల్స్ పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.