జనం వాయిస్ దినపత్రిక :

భారత్ vs ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియా(Australia)లోని పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచులో భారత్(India)పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆంపైర్లు ఆటను 26 ఓవర్లకు కుదించగా భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు శుభ్‌మాన్ గిల్(10), రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లీ(0) పరుగులతో తీవ్ర నిరాశ పరిచారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో ఉంది. డక్‌వర్త్ లూయిస్-స్టెర్న్(DLS) పద్ధతి ప్రకారం ఆంపైర్లు 131 పరుగుల లక్ష్యన్ని నిర్దేశించారు. 21.1 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి లక్ష్యన్ని ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్(46), జోష్ ఫిలిప్(37), రెన్ షా(21) పరుగులు చేశారు. రెండో వన్డే గురువారం జరగనుంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments