EPAPER
Thursday, April 2, 2026
Google search engine

ఐపిపిబి ఇంటర్న్షిప్ పూర్తి చేసిన 10 మంది విద్యార్థులకు సర్టిఫికెట్స్ వితరణ.

📰 Generate e-Paper Clip

ఐపిపిబి ఇంటర్న్షిప్ పూర్తి చేసిన 10 మంది విద్యార్థులకు సర్టిఫికెట్స్ వితరణ.

జనం వాయిస్ దినపత్రిక, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇంటర్న్షిప్ పూర్తి చేసిన 10 మంది విద్యార్థులకు సర్టిఫికెట్స్ వితరణ కార్యక్రమం. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 45 రోజుల ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ని అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఐపిపిబి సీనియర్ మేనేజర్ రాజేష్ మేనేజర్ మోహన్  మాట్లాడుతూ గాయత్రి కళాశాల నుండి 10 మంది విద్యార్థినీ ,విద్యార్థులు బ్యాంకు సేవలు ,డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, ఫైనాన్షియల్ ఇంక్లూషన్, కస్టమర్ సర్వీస్ తదితర అంశాలపై ప్రాయోగిక అనుభవాన్ని పొందారు. ఈ సందర్భంగా సీనియర్ బ్యాంక్ మేనేజర్ రాజేష్  విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించి ,రూరల్ బ్యాంకింగ్ రంగంలో ఉన్న అవకాశాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ అల్లంకి శ్రీనివాస్  మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన విద్యార్థిని ,విద్యార్థులు  కళాశాల కరస్పాండెంట్ అల్లంకి శ్రీనివాస్  కు పోస్ట్ ఆఫీస్ అధికారులకు, మరియు అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందించిన వారికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!