EPAPER
Thursday, April 2, 2026
Google search engine

కాట్నపల్లిలోని కనకదుర్గ రైస్ మిల్లులో ప్రమాదం..ఇద్దరు కార్మికులకు గాయాలు

📰 Generate e-Paper Clip

కాట్నపల్లిలోని కనకదుర్గ రైస్ మిల్లులో ప్రమాదం..ఇద్దరు కార్మికులకు గాయాలు

జనం వాయిస్, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌  మండలం కాట్నపల్లిలోని కనకదుర్గ రైస్ మిల్లులో భారీ ప్రమాదం జరిగింది.కాట్నపల్లి శివారులోని రైస్‌ మిల్లులో బాయిలర్‌ పేలింది.ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.అప్రమత్తమైన యాజమాన్యం గాయపడిన ఇద్దరినీ హుటాహుటిన కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు రైస్‌మిల్‌ యాజమాన్యం తెలిపింది.ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చినట్లు పేర్కొంది.ఈ ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లినట్లు తెలిపారు.రెండు గోదాములతో పాటూ మిషన్లు, వరి ధాన్యం, బియ్యం తదితర వస్తువులు దెబ్బతిన్నట్లు వివరించారు.దాదాపు రూ.2కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు.విషయం తెలుసుకున్న సుల్తానాబాద్‌ పోలీసులు,రెవెన్యూ అధికారులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!