కార్మిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం..!
జనం వాయిస్ దినపత్రిక:
హైదరాబాద్ బాలానగర్ లోని టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ కార్మికుల గుర్తింపు యూనియన్ శనివారం నిర్వహించిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ , బీజేపీ ఎంపీ రఘునందన్ రావుని ఓడించి, భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్,మాట్లాడుతూ..ఎమ్ టీ ఏ ఆర్, కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి 359 మంది కార్మికులను పర్మనెంట్ చేసి, కార్మికులకు క్యాంటీన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కార్మికులకు బేసిక్‌ను 30% నుంచి 50% కు పెంచడం జరిగిందని, అదేవిధంగా ఇప్పుడు తనపై నమ్మకం పెట్టుకొని గెలిపించిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.కంపెనీలో కార్మికులకు ఉన్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఎమ్ టి ఏ ఆర్ యూనియన్ జనరల్ సెక్రటరీ మాయ రాజయ్య, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ సత్యప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ లు వెంకటేశ్వర రెడ్డి, సమ్మయ్య, రాయుడు యాదవ్ తదితరులు ఉన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments