EPAPER
Thursday, April 2, 2026
Google search engine

కురిక్యాల ప్రభుత్వ పాఠశాల ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద సిరియస్.

📰 Generate e-Paper Clip

కురిక్యాల ప్రభుత్వ పాఠశాల ఘటనపై మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద సిరియస్.

జనం వాయిస్ దినపత్రిక, కరీంనగర్:

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై అటెండర్ చేసిన అనుచిత ప్రవర్తను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద  తీవ్రంగా ఖండించారు.విద్యాసంస్థల్లో చదువుకునే బాలికల భద్రత, గౌరవం పట్ల నిర్లక్ష్యాన్ని, ఏ రూపంలోనూ సహించబోమని చైర్పర్సన్ స్పష్టం చేశారు.జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసి, విషయంపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.విద్యాసంస్థలు విద్యార్ధినుల భవిష్యత్తు నిర్మాణంలో కీలకమైనవని, అవి స్వేచ్ఛాయుత, సురక్షిత మరియు గౌరవప్రదమైన వాతావరణం లో ఉండాలని, విద్యార్థినులపై ఎలాంటి వేధింపులు, అనుచిత ప్రవర్తనను ఏ పరిస్తుతలోనూ సహించబోమని శారద స్పష్టం చేశారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించేందుకు, జిల్లా యంత్రాంగం కాలేజీలు, విద్యాసంస్థలు మరియు హాస్టళ్లలో తనిఖీలు చేపట్టి భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని చైర్పర్సన్ ఆదేశించారు.ఈ కేసు పురోగతిని మహిళా కమిషన్ పర్యవేక్షిస్తామని, బాధిత విద్యార్థినులకు అన్ని విధాల సహకారం అందిస్తామని చైర్పర్సన్ నేరెళ్ల శారద హామీ ఇచ్చారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!