కూర వండలేదని అడిగినందుకు భార్య ఆత్మహత్య
జనం వాయిస్ దినపత్రిక:
తెలంగాణ : జగిత్యాల జిల్లాలో ఇంట్లో కూర వండలేదని భర్త ప్రశ్నించడంతో మనోజ (27) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తొమ్మిదేండ్ల క్రితం సుధాకర్‌తో వివాహం జరిగిన ఈమెకు ముగ్గురు పిల్లలున్నారు. అక్టోబర్ 25 రాత్రి భోజనం సమయంలో కూర లేకపోవడంతో ఎందుకు వండలేదని ప్రశ్నించాడు. దీంతో ఆమె బెడ్రూంలోకి వెళ్లి గడియవేసుకుంది. తలుపు ఎంత కొట్టినా తీయకపోవడంతో స్థానికుల సాయంతో పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments