EPAPER
Monday, February 16, 2026
Google search engine

కెన్యా లో ఘోర విమాన ప్రమాదం. -12 మంది మృతి.

📰 Generate e-Paper Clip

కెన్యా లో ఘోర విమాన ప్రమాదం.

-12 మంది మృతి.

జనంవాయిస్ దినపత్రిక, అంతర్జాతీయం:


కెన్యాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం కెన్యాలోని క్వాలే కౌంటీలో టూరిస్టులతో ప్రయాణిస్తు న్న విమానం కూలిపోయి 12మంది మృతిచెందారు.12మంది పర్యాటకులతో డయాని నుండి మాసాయి మారా వెళ్తున్న ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింద ని,కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది.ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు అధికారులు సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ విమానం ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన మాసాయి మారా నేషనల్ రిజర్వ్ వైపు వెళ్తోంది. డయానీ ఎయిర్‌స్ట్రిప్ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండ ప్రాంతం, దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మాసాయి మారా నేషనల్ రిజర్వ్ ఫారెస్టు ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఉంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!