- కొడుకుతో కలిసి ఆస్తులు కొన్న సోనూసూద్..
- రూ.3.60 కోట్లతో మరో ప్రాపర్టీ కూడా.
జనం వాయిస్ సినిమా:
బాలీవుడ్ నటుడు సోనూసూద్, ఆయన కుమారుడు ఈషాన్ సూద్ కలిసి కొత్త ప్రాపర్టీని కొనుగోలు చేశారు. ముంబై మెట్రోపాలిటన్ దగ్గర రూ.3.60 కోట్లు వెచ్చించి ఓ ఆస్తిని కొనుగోలు చేశారు. ముంబై దగ్గర పన్వేల్‌లోని శిర్డాన్‌లో 777 చదరపు గజాల భూమిని రూ.1.05 కోట్లకు, ఓ అపార్ట్‌మెంట్‌ను రూ.2.6 కోట్లతో అపార్ట్ మెంట్‌ను కొనుగోలు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ తాజాగా జరిగింది. ఇందుకు గాను రూ.6.30 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించారు.ఈ ఏడాది ఆగస్టులో ముంబై అంధేరి వెస్ట్‌లో రూ.2.6 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ఈ అపార్ట్ మెంట్ 900 చదరపు అడుగుల రెరా కార్పెట్ ఏరియా 1,080 చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాతో ఉంది. ఈ లావాదేవీలో రూ.15.60 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ముంబై-పూణె ఎక్స్ ప్రెస్‌వే, పన్వేల్-కర్జాత్ రైల్వే లైన్ వెంబడి ఉన్న పన్వేల్ అత్యంత కీలకమైన వాణిజ్య కేంద్రంగా అవతరించింది. నెవీ ముంబై, థానే, ముంబై నగరాలకు సమీపంలో ఉండటం వల్ల నెవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, అటల్ సేతు (ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్) వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments