EPAPER
Monday, February 16, 2026
Google search engine

గోదావరిలో స్నానానికి వెళ్లిన ప్రేమ జంట-యువతి మృతి.-యువకుడిని కాపాడిన జాలరులు..!

📰 Generate e-Paper Clip

గోదావరిలో స్నానానికి వెళ్లిన ప్రేమ జంట-యువతి మృతి.-యువకుడిని కాపాడిన జాలరులు..!

జనం వాయిస్ దినపత్రిక, గోదావరిఖని:

గోదావరిఖని లోని గోదావరి తీరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమలో పడ్డ ఇద్దరు యువతీ యువకులు గోదావరి నదికి స్నానానికి వెళ్లి దురదృష్టవశాత్తు ఒకరు ప్రాణం కోల్పోయిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే… పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు స్థానికంగా నివసించే యువతిని ప్రేమించాడు. ఇద్దరూ గత కొంతకాలంగా పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి, ఆ యువతితో గోదావరి నది శివారుకు వెళ్లాడు.అందరూ కలిసి నదిలో స్నానం చేస్తుండగా,యువతి అనుకోకుండా లోతు ప్రాంతంలోకి వెళ్లి మునగసాగింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన యువకుడూ కొట్టుకుపోయాడు.అయితే అల్లరి చెలరేగడంతో సమీపంలో ఉన్న జాలరులు వెంటనే స్పందించి యువకుడిని కాపాడగా, యువతి మాత్రం నీటిలో మునిగిపోయింది.స్థానికులు కుటుంబసభ్యులు ఆమెను బయటకు తీశారు కాని అప్పటికే ప్రాణాలు విడిచింది.ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!