డిసెంబర్ 31 వరకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు.
-జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జే.రంగారెడ్డి.
జనం వాయిస్,పెద్దపల్లి అక్టోబర్ -29:
2025-26 విద్యా సంవత్సరంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ల దరఖాస్తు గడువు డిసెంబర్ 31 వరకు పొడిగించడం జరిగిందని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జే.రంగారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న అర్హులైన మైనారిటీ విద్యార్థిని, విద్యార్థులు, కళాశాలల ప్రిన్సిపాల్స్ తమ కళాశాలల్లోనీ విద్యార్థిని, విద్యార్థులు అందరూ వారి అర్హతలను బట్టి ఉపకార వేతనాలను https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ లో డిసెంబర్ 31 , 2025 లోపు ఫ్రెష్, రెన్యువల్ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఆయా కళాశాల ప్రిన్సిపాల్ ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జే.రంగారెడ్డి ఆ ప్రకటనలో కోరారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments