EPAPER
Friday, April 3, 2026
Google search engine

తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ..

📰 Generate e-Paper Clip

తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ..

జనం వాయిస్ దినపత్రిక:

తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల ఐదురోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది ఐఎండీ.మంగళశారం జయశంకర్‌ భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.ఉరుములు, మెరుపులు, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది.బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేసింది. నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కరీంనగర్‌, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!