దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎన్ కౌంటర్..!
జనం వాయిస్ దినపత్రిక:
ఢిల్లీలోని రోహిణిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో బీహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. హాతుల్లో గ్యాంగ్ లీడర్ రంజన్ పాఠక్ ఉన్నట్లు పోలీసులు వెల్లడిం చారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం రాత్రి ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ బీహార్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో మొత్తం నలుగురు గ్యాంగ్స్టర్లు హతమయ్యారు.దేశ రాజధానిలో ఈ ముఠా కదలికలపై నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరక ఈ ఎన్కౌంటర్ నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున 2:20 గంటలకు ఈ కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో మరణించిన గ్యాంగ్స్టర్లను.. రంజన్ పాఠక్ (25), బిమ్లేష్ మహ్తో అలియాస్ బిమ్లేష్ సాహ్ని (25), మనీష్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21)గా పోలీసులు గుర్తించారు.ఈ నలుగురు నిందితులు బీహార్‌లో అనేక క్రిమినల్ కేసుల్లో వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. ‘సిగ్మా,అండ్ కంపెనీ’ పేరుతో చెలరే గుతున్న ఈ ముఠాకు రంజన్ పాఠక్ వహిస్తున్నాడు.బీహార్‌లో నమోదైన అనేక కేసుల్లో ఈ నలుగురు పరారీలో ఉన్నారు.బీహార్ ఎన్నికలకు ముందు ఈ నలుగురు పెద్ద కుట్రకు ప్రణాళిక వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతలో ఢిల్లీ, బీహార్ పోలీసు బృం దాలు వారిని ఎన్కౌంటర్లో హతమార్చడం విశేషం. కాగా ఢిల్లీలోని కరావాల్ నగర్‌కు చెందిన అమన్ ఠాకూర్ తప్ప, మిగిలిన ముగ్గురు గ్యాంగ్స్టర్లు బీహార్‌లోని సీతామర్హికి చెందినవారిగా పోలీసులు తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments