పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు
జనం వాయిస్, పెద్దపల్లి:
పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలోని శ్రీరామ జిన్నింగ్ ఇండస్ట్రీస్ సిసిఐ CCI ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ రైతులు దళారీల చేతుల్లో మోసపోకుండా పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది అన్నారు.08 శాతం తేమతో ₹ 8110/- రూపాయలు పత్తి పంటకు ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ఎప్పుడు రైతుల మేలు కోరుతుంది అన్నారు. పత్తి,వరి, మిర్చి,మొక్కజొన్నలు, పొద్దు తిరుగుడు రైతులు ఏ పంట పెట్టిన ఆ పంటకు ప్రభుత్వం మద్దతు ఇచ్చి రైతులను పంట నష్టపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుంది అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుకు పోతుంది అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 24 గంటలు రైతులకు కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ఇప్పటికే 200 యూనిట్ల కరెంటు మాఫీ, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, రేషన్ కార్డులు, 10 లక్షల ఆరోగ్యశ్రీ, మహిళలకు జీరో వడ్డీకి రుణాలు, సన్న వడ్లకు బోనస్ ఎన్నో పథకాలతో ముందుకు పోతుంది అన్నారు. గత వేసంగి, ప్రస్తుత వర్షాకాలం పంటలకు ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇవ్వబోతుంది అన్నారు.వ్యవసాయం చేయడంలో రైతును మించిన అనుభవజ్ఞుడు ఎవరు లేరు అన్నారు. ఈ భూమిలో ఏ పంట పెడితే పండుతుందో రైతు ఆ మట్టిని బట్టి చెప్పుతాడు అన్నాడు. త్వరలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించి గింజ కటింగ్ లేకుండా వారి ధాన్యం కొనడం జరుగుతుంది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు స్వయాన రైతు అయిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతినిత్యం రైతుల కోసమే ఆలోచన చేస్తూ వారి సంక్షేమం కోసం ఎన్నో గొప్ప గొప్ప మార్పులు తీసుకొస్తున్నారు అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గత పాలకులు రైతుల దగ్గర క్వింటాలు వడ్లకు 10 కిలోల పైన తరుగు పెట్టీ వారి నడ్డివిరిచారని అన్నారు. మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను శాసనసభ్యుడుగా ఎన్నికైన తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలో ఎలాంటి తరుగు లేకుండా చేసి రైతన్నలకు మేలు చేశామని ప్రజలకు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్లు స్వరూప, ప్రకాష్ రావు మరియు శ్రీరామ జిన్నింగ్ ఇండస్ట్రీస్ యాజమాన్యం మరియు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments