పదవ తరగతి విద్యా అర్హత తో ఆర్టీసీలో ఉద్యోగాలు!
జనం వాయిస్ దినపత్రిక:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న డ్రైవర్, శ్రామిక్ ఖాళీల భర్తీకి ఇటీవల స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 8, 2025వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి పదో తరగతిలో ఉత్తీర్ణత కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అక్టోబర్ 28వ తేదీ అనగా రేపు సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ పేర్కొంది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితు ల్లోనూ దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి.ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1,743 డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాలను ఆర్టీసీ భర్తీ చేయనుంది. వీటిల్లో డ్రైవర్ పోస్టులు 1000, శ్రామిక్ పోస్టులు 743 వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలని అధికారులు తెలిపారు.అభ్యర్ధుల వయోపరిమితి 2025 జులై 1వ తేదీ నాటికి డ్రైవర్ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఈఎస్ఎం అభ్యర్థులకు 3 ఏళ్ల చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments