EPAPER
Monday, February 16, 2026
Google search engine

బాబా వేషంలో సర్కారీ టీచర్..! విద్యార్థుల్లో భయం..

📰 Generate e-Paper Clip

బాబా వేషంలో సర్కారీ టీచర్..! విద్యార్థుల్లో భయం..
విద్యాలయంలో బాబామాదిరి వేషధారణ.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం ఘటన.

జనం వాయిస్ దినపత్రిక, మహబూబాబాద్:

మహబూబాబాద్ జిల్లా: అక్టోబర్ 29:కురవి మండలం రాజోల్ గ్రామ ప్రభుత్వ హైస్కూల్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక ఉపాధ్యాయుడు తన విధుల్లో ఉండే సమయంలో బాబా మాదిరిగా చండి మాలలు, విభూతి, కమండలం, పొడవు గడ్డం, కాషాయపు వస్త్రాలు ధరించి స్కూల్‌కు రావడం స్థానికుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది.ఉపాధ్యాయుడు ప్రతిరోజూ స్కూల్‌కు అదే వేషధారణతో హాజరవుతూ, తరగతుల్లో భయం, అయోమయం కలిగిస్తున్నట్లు విద్యార్థులు, తల్లి తండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు పిల్లలు భయంతో పాఠశాలకు రాకుండా పోతున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, ఆ ఉపాధ్యాయుడు కురవి మండలం గుండ్రాతిమడుగు స్టేషన్ గ్రామానికి చెందినవారు. అక్కడ ఆయన స్వయంగా “కామాఖ్య దేవి శక్తి పీఠం” పేరుతో దేవాలయం నిర్మించి, “దేశంలో రెండవ కామాఖ్య శక్తి పీఠం” అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు.
తనను “శ్రీ శ్రీ సిద్ధయోగి శివశక్తీ ప్రతాప్‌నాథ్ స్వామీజీ” అని పిలిపించుకుంటూ, మొబైల్ నంబర్‌తో కలిపి రాజకీయ విజయం, ఆరోగ్యం, వివాహం, సంతానం వంటి సమస్యలకు పరిష్కారమని ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.

*ఉద్యోగ సర్వీస్ రూల్స్ చట్టపరమైన కోణం*
విద్యా శాఖ సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు తటస్థత, మత నిరపేక్షత, వృత్తిపరమైన ప్రవర్తన పాటించాలి. గవర్నమెంట్ సర్వంట్స్ కండక్ట్ రూల్స్,: 1964 ప్రకారం ఉద్యోగులు మత ఆధ్యాత్మిక ప్రచారం ఎక్కడ చేయరాదు. స్కూల్ లో అయితే విద్యార్థులలో భయం లేదా మత పరమైన ప్రభావం కలిగించే ప్రవర్తన నిషేధం. స్కూల్ ప్రాంగణంలో ఆధ్యాత్మిక, తాంత్రిక కార్యక్రమాలు నిర్వహించడం చట్ట విరుద్ధం అవుతుంది అనే విషయం ఈ మాస్టారుకి తెలియక పోవచ్చు…

*తల్లిదండ్రుల అభ్యర్థన*
స్కూల్ విద్యార్థుల మనసులపై ప్రతికూల ప్రభావం పడుతోందని, విద్యార్థులు చదువుపై దృష్టి కోల్పోతున్నారని, ఇలాంటి వ్యక్తిపై జిల్లా విద్యా శాఖ చర్య తీసుకోవాలని తల్లి దండ్రులు జిల్లా విద్యాధికారిని కోరుతున్నారు.

*అధికారుల స్పందన*
ఈ విషయం పై జిల్లా విద్యా శాఖ, జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారులు తక్షణమే దర్యాప్తు చేపట్టి ఆ ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!