మాజీ మంత్రి కేటీఆర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటన.!
మాజీ మంత్రులను అడ్డుకున్న పోలీసులు.
జనం వాయిస్, కాళేశ్వరం, జూలై 05:
తెలంగాణలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లోని కన్నెపల్లి పంప్ హౌజ్ పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ బృందాన్ని జనగాం జిల్లా పెంబర్తి వద్ద బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు లతో కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.
దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెల కొంది.ఈ సందర్భం గా కేటీఆర్ మీడియాతో మాట్లా డుతూ.. సర్కార్ వైఫల్యం బయటప డుతోందనే మమ్మ ల్ని అడ్డుకుంటు న్నారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి సందర్శనకు వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు.
వృథాగా పోతున్న లక్ష క్యూసెక్కుల కాళేశ్వరం జలాలను, సర్కార్ చేతగానితనాన్ని తెలంగాణ ప్రజలకు చూపెడతామని అన్నారు. నీళ్లను ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండగట్టే కుట్రలు చేస్తున్న రేవంత్ సర్కార్ దుర్మార్గపు వైఖరిని ఎండగడ తామని అన్నారు.
కేటీఆర్ కాళేశ్వరం కన్నెపల్లి పంప్‌హౌజ్ పర్యటన నేపథ్యం లో హైదరాబాద్- వరంగల్, కరీంనగర్ హైవే మీద పోలీసు లు భారీగా మోహరించారు. పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయ కులు, కార్యకర్తలు, రైతుల వాహనాల ను అడ్డుకుంటున్నా రు. మరోవైపు కేటీఆర్ పర్యటనకు వెళ్లకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments