యువత ఆదర్శంగా నిలవాలే..!
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.
జనం వాయిస్, మంథని:
ఎన్నో కష్టాలను ఓర్చి ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలువాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. గ్రూప్ 2 సాధించి తెలంగాణ సెక్రటరియేట్‌లో జీఏడీ విబాగంలో ఏఎస్‌ఓ ఉద్యోగం సాధించిన మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన విజ్జగిరి సతీష్‌ను సోమవారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదువుకుంటూ పట్టుదలతో ముందుకు పోతే లక్ష్యసాధన సులభతరమవుతుందన్నారు. ప్రభుత్వ కొలువు సాధించిన సతీష్ నేటి యువతకు ఆదర్శమని, ఆయన స్పూర్తితో మరికొంత మంది యువకులు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే తల్లిదండ్రులతో పాటు ఆ ఊరికి మంచి పేరు వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని అన్నారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments