రీ క్రియేషన్ క్లబ్ నూతన ప్రధాన కార్యదర్శికి సన్మానం.
-పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొట్టె సదానందంకు జర్నలిస్టుల సత్కారం.
జనం వాయిస్, పెద్దపల్లి:
ఇటీవల జరిగిన రీ క్రియేషన్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించిన సీనియర్ జర్నలిస్టు కొట్టె సదానందమును తోటి జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ఆదివారం ప్రెస్ క్లబ్బులో జరిగిన వేడుకల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, భవిశ్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం సదానందం మాట్లాడుతూ, తనపై నమ్మకంతో భారీ విజయాన్ని అందించిన రీ క్రియేషన్ క్లబ్ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రస్థాయిలో పెద్దపల్లికి మంచిపేరును తీసుకువచ్చేలా రీ క్రియేషన్ క్లబ్బును తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొల్లూరి గోపాల్, ఉపాధ్యక్షులు బెజ్జంకి నరేష్, తిర్రి తిరూపతి గౌడ్, కోశాధికారి ఆరెళ్ళి మల్లేష్, కీర్తి రమేష్, లైశెట్టి రాజు, కత్తెర్ల తిరుపతి యాదవ్, శిలారపు కిషన్, ఇజ్జగిరి వెంకటేష్, మారుపాకల అంజన్న,నల్లారపు తిరుపతి, నాగపూరి తిరుపతి గౌడ్, సంతోష్, లచ్చన్న, తిర్రి సుధాకర్ గౌడ్, కళ్యాన్, నగునూరి శ్రీనివాస్, తోట సతీష్, కత్తెరల చందర్, మచ్చార్ల వంశీ,కొయ్యాడ తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments