EPAPER
Monday, February 16, 2026
Google search engine

సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత..

📰 Generate e-Paper Clip


సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత..

జనం వాయిస్ దినపత్రిక :


తెలంగాణ ప్రభుత్వం ఆధార్ వివరాలను అనుసంధానం చేయని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను నిలిపివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ఉన్న సుమారు 10.14 లక్షల మంది ఉద్యోగులు తమ ఆధార్ మరియు సెల్‌ఫోన్ నంబర్ల వివరాలను ఆర్థిక శాఖ నిర్వహణ పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ లోపు వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని, లేదంటే జీతాలు నిలిచిపోతాయని ఆర్థిక శాఖ హెచ్చరించింది. అయినా కొంతమంది ఆ వివరాలను అప్ లోడ్ చేయకపోవడంతో వారి జీతాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పారదర్శకతను పెంచడంలో భాగంగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. తమ ఆధార్ కార్డు వివరాలను ప్రభుత్వ రికార్డులతో అనుసంధానం చేయని ఉద్యోగులందరి జీతాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ఉద్యోగుల వివరాల నమోదులో ఉన్న జాప్యాన్ని సరిదిద్దడానికి, డ్యుయల్ పేమెంట్ వంటి అవకతవకలను నివారించడం.తెలంగాణ ఆర్థిక శాఖ ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ నెల 25వ తేదీ లోపు తమ ఆధార్, సెల్‌ఫోన్ నంబర్ల వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని స్పష్టంగా ఆదేశించింది. ఈ వివరాలను అందించని వారికి ఈ నెల జీతం చెల్లించబడదని ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులను హెచ్చరించింది. అయినా చాలా మంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు.రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం శాశ్వత, తాత్కాలిక కలిపి 10.14 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి పేర్లు, హోదా, ఆధార్ , ఫోన్ నంబర్ల వివరాలను ప్రతి నెల 10వ తేదీలోపు ఆర్థిక శాఖ నిర్వహణ పోర్టల్ లో నమోదు చేయాలని గత నెలలోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ.. ఈ నెల 16వ తేదీ వరకు కూడా సగం మంది ఉద్యోగుల వివరాలు కూడా పూర్తిగా నమోదు కాలేదు. ఈ నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వివరాలు ఇవ్వనివారి జీతాల బిల్లులను ఆర్థిక శాఖ నిలిపివేసింది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!