హైదరాబాద్లో మెట్రో స్టేషన్ వద్ద బుల్లెట్ కలకలం
జనం వాయిస్ దినపత్రిక:
హైదరాబాద్లోని మూసపేట్ మెట్రో స్టేషన్లో ఓ ప్రయాణికుడి
వద్ద బుల్లెట్ లభించడం కలకలం రేపింది.బిహార్కు చెందిన మహమ్మద్ అనే యువకుడు మూసాపేట ప్రగతినగర్లో ఉంటూ ఫ్యాబ్రికేషన్ వర్క్చేస్తున్నాడు. శనివారం రాత్రి ఓ బ్యాగ్ మూసాపేట మెట్రో స్టేషన్కు వచ్చాడు సాధారణ స్కానింగ్లో భాగంగా భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. మహమ్మద్ వద్ద అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు బీప్ శబ్దం రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.అతడిని మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయగా 9 ఎంఎం బుల్లెట్ లభించింది. దీనిపై కూకట్పల్లి పోలీసులకు మెట్రోస్టేషన్ సిబ్బంది.ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments