గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు.
జనం వాయిస్, వెబ్ డెస్క్:
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని గ్రామాలకు ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 15వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు ఆరు రాష్ట్రాలకు కేంద్రం రూ.1500 కోట్లకుపైగా గ్రాంట్లు రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణలోని పంచాయతీ రాజ్ సంస్థలకు రూ.247.94 కోట్ల అన్ టైడ్ గ్రాంట్స్ కేటాయించారు. ఈ నిధులు రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలకు ఉపయోగించనున్నారు. గ్రామాల్లో రోడ్లు, నీళ్లు, విద్యుత్, పారిశుద్ద్యం లాంటి మౌలిక సదుపా యాలు ఆ నిధులతో కల్పించనున్నారు. రాష్ట్రంలోని 12600 గ్రామ పంచాయతీలకు వీటిని వినియోగించనున్నారు.
కేంద్రం కొత్త నిబంధన
ఉద్యోగుల జీతాలకు కాకుండా పంచాయతీల్లో అభివృద్ది పనులకు మాత్రమే ఈ నిధులు ఉపయోగించాలని కేంద్రం నిబంధన విధించింది. ఆ నిధులతో గ్రామాల్లో అభి వృద్ది పనులు పరుగులు పెట్టనున్నాయి. గ్రాంట్ల విడుదలకు సంబంధించి కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధిం చి తొలి విడత గ్రాంట్స్‌ను ఇప్పుడు విడుదల చేసింది. ఈ గ్రాంట్స్‌ను గ్రామ సభ ఆమోదంతో ఖర్చు చేయా ల్సి ఉంటుంది. మురుగు కాల్వల మరమ్మత్తులు, రోడ్ల నిర్మాణం, వీధి దీపాలు ఏర్పాటు, శ్మసాన వాటికల నిర్మాణం వంటి పనులకు ఉపయోగించ నున్నారు. సిబ్బంది జీతా లు, ఆఫీసుల ఖర్చచులకు వీటిని ఉపయోగించకూ డదు. ఈ నిధులను కేంద్రం నేరుగా స్థానిక సంస్థల అకౌంట్లలో జమ చేయనుంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments