EPAPER
Thursday, April 2, 2026
Google search engine

27-10-2025 సోమవారం
   🌷రాశి ఫలితాలు🌷

📰 Generate e-Paper Clip



27-10-2025 సోమవారం
   🌷రాశి ఫలితాలు🌷
—————————————
మేషం

వ్యాపారమున సొంత నిర్ణయాలతో లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి.
—————————————
వృషభం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మిత్రులతో వివాదాలు మానసికంగా చికాకుగా కలిగిస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో కష్టించినా ఫలితం కనిపించదు. సోదరులతో  స్థిరాస్తి వివాదాలు ఉంటాయి.
—————————————
మిధునం

వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభించదు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు.
—————————————
కర్కాటకం

స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. చిన్ననాటి మిత్రులతో  విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
—————————————
సింహం

ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. భాగస్వామితో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.
—————————————
కన్య

ఉద్యోగమున ఉన్నతాధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట  ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. విద్యార్థుల శ్రమ ఫలించదు. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో వివాదాలు తప్పవు.
—————————————
తుల

ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని  సమస్యలు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
—————————————
వృశ్చికం

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
—————————————
ధనస్సు

సోదరులతో స్థిరస్తి వివాదాలలో  నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
—————————————
మకరం

విలువైన వస్తు వాహన లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. స్థిరస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు.
—————————————
కుంభం

వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
—————————————
మీనం

వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.
—————————————
🍁 శుభం భూయాత్ 🍀


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!