జిల్లాలోని ప్రతి విద్యా సంస్థకు గ్యాస్ కనెక్షన్ అందించాలి.
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
-ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్.
జనం వాయిస్,పెద్దపల్లి,నవంబర్03:
జిల్లాలోని ప్రతి ప్రభుత్వ విద్యా సంస్థకు అవసరం మేరకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం క్రింద నూతన గ్యాస్ కనెక్షన్ లు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ పేదలందరికీ గ్యాస్ కనెక్షన్ వచ్చేలా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం క్రింద గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు 300 రూపాయల సబ్సిడీ బ్యాంకు ఖాతాలలో ప్రతి సిలిండర్ కొనుగోలు పై జమ చేయడం జరుగుతుందని అన్నారు.జిల్లాలో నూతనంగా 23 వేల రేషన్ కార్డులు జారీ చేయడం జరిగిందని, వాటిలో ఎవరికైనా గ్యాస్ కనెక్షన్ లేని పక్షంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు.జిల్లా లోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వారీగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా నూతన గ్యాస్ కనెక్షన్ కోసం వచ్చిన దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలోని ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలలో గ్యాస్ కనెక్షన్ లేని వాటిని గుర్తించి, అక్కడ ఉన్న గ్యాస్ ఏజెన్సీల ద్వారా నూతన గ్యాస్ కనెక్షన్ అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, విద్యా సంస్థలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా నూతన గ్యాస్ కనెక్షన్ల సరఫరాకు అవసరమైన నిధులను పూర్తి స్థాయిలో కలెక్టరేట్ నుంచి చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.మధ్యాహ్న భోజన పథకం క్రింద స్కూల్ పేరు మీద అవసరమైన మేరకు గ్యాస్ కనెక్షన్ లను మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు.నవంబర్ 25 నాటికి జిల్లాలో ఏ విద్యా సంస్థలో కూడా కట్టెల పొయ్యి పైనా వంట చేయడానికి ఆస్కారం ఉండకుండా గ్యాస్ కనెక్షన్, అవసరమైన మేరకు పెద్ద గ్యాస్ స్టవ్ పంపిణీ చేయాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, సి సెక్షన్ సూపరింటెండెంట్ ప్రకాష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments