శబరిమల యాత్రలో విషాదం.
–మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు చెందిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి.
జనం వాయిస్, మంచిర్యాల:
మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట పట్టణంలో వ్యాపారం నిర్వహిస్తున్న సత్యనారాయణ జనరల్ స్టోర్ యజమాని పాలకుర్తి సత్యనారాయణ, ( 63) రమదేవి (59) దంపతులు అయ్యప్ప మాలలో AP16 TG 5299 ఓ ప్రైవేట్ సర్వీస్ లో శబరిమలై దర్శనానికి వెళ్లారు. 15 న అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో కన్యాకుమారి వద్ద బైపాస్ రోడ్ లో గురువారం సాయంత్రం 6-55 నిమిషాలకు అయ్యప్ప స్వాముల కోసం రెండు గంటల సేపు టూరిస్ట్ నిలిపివేశారు. సముద్ర స్నానం, అక్కడున్న దేవాలయాలు సందర్శించి టూరిస్ట్ ఆపిన చోటికి రాత్రి 9 గంటలకు దంపతులు రోడ్డు దాటుతుండగ ఓ వాహనం ఢీ కొని దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన దంపతుల మృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments