EPAPER
Monday, February 16, 2026
Google search engine

20-01-2026 మంగళవారం..రాశి ఫలితాలు.

📰 Generate e-Paper Clip

20-01-2026 మంగళవారం..రాశి ఫలితాలు.
—————————————
మేషం

ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున  స్థానచలన సూచనలున్నవి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
—————————————
వృషభం

స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. పాత ఋణాలు తీర్చగలుగుతారు. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగమున  అధికారుల అనుగ్రహంతో  ఉన్నత పదవులు పొందుతారు. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి.
—————————————
మిధునం

ఉద్యోగమున  పని ఒత్తిడి ఉన్నప్పటికీ  పనులు పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారములలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో  పాల్గొంటారు. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
—————————————
కర్కాటకం

గృహమున సంతాన శుభాకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో సహాయ సహకారాలు అందుతాయి.
—————————————
సింహం

దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో అధిక కష్టంతో అల్పఫలితం పొందుతారు. ఉద్యోగమున  అదనపు బాధ్యతలు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలలో ఊహించని సమస్యలు  కలుగుతాయి.
—————————————
కన్య

నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సన్నిహితుల సహాయంతో  కొన్ని  పనులు  పూర్తి అవుతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.  స్ధిరాస్తి   క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.
—————————————
తుల

చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో  కీలక  నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.  ఉద్యోగ వాతావరణం ప్రశాంతగా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం  దాలుస్తాయి.
—————————————
వృశ్చికం

అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున  దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అకారణ వివాదాలు  కలుగుతాయి.
—————————————
ధనస్సు

ఆకస్మిక  ప్రయాణాల వలన  శారీరక శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సన్నిహితుల  ప్రవర్తన కొంత ఆశ్చర్య పరుస్తుంది. మాతృ వర్గ బంధువుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
—————————————
మకరం

వృత్తి ఉద్యోగమున అధికారుల గుర్తింపు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ముఖ్యమైన  వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి.
—————————————
కుంభం

బంధు మిత్రులతో మాటపట్టింపులు  పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి.  వృత్తి  ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
—————————————
మీనం

నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. సన్నిహితుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వృత్తి వ్యాపారమున నూతన  ఆలోచనలు  అమలు చేస్తారు. ఆర్థిక  పురోగతి కలుగుతుంది. పాత  మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన  వ్యవహారాలు సజావుగా  సాగుతాయి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!