- పాత కక్ష్యలతో వ్యక్తి దారుణ హత్య.
- – రామగిరి మండలం సెంటినరీకాలనీలో ఘటన.
- జనం వాయిస్, రామగిరి (పెద్దపల్లి జిల్లా):
- పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో పట్టపగలు హత్య స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. రామగిరి మండల కేంద్రం సెంటినరీకాలనీలో శనివారం మొలుగూరి కొమురయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సెంటినరీకాలనీలోని కమ్యూనిటీహాల్ లో జరుగుతున్న పెళ్ళికి నారాయణపూర్ కు చెందిన కొమురయ్య, తమ్ముడు హాజరవగా పాత కక్షలతో వారి సమీప బంధువు ఆయనపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మధ్యలోకీ వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన కొమురయ్యకు కత్తిపోటు పడటంతో మృతి చెందాడు.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకోని వివరాలు ఆరా తీస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments