EPAPER
Thursday, March 5, 2026
Google search engine

ఖమ్మంలో కేడీ దంపతులు.

📰 Generate e-Paper Clip

ఖమ్మంలో కేడీ దంపతులు.


జనం వాయిస్, ఖమ్మం, మార్చి 5:

భార్యాభర్తలిద్దరూ.. ఎల్ఐసీ ఏజెంట్లు.. అందరినీ.. మంచిగా బోల్తా కొట్టించి.. ఎల్ఐసీ కట్టించేవారు.. ఈ క్రమంలోనే.. ఓ భారీ స్కామ్ కు తెరలేపారు.. సినీ ఫక్కీలో భారీ మోసానికి పాల్పడి కోట్లు కొట్టేశారు. ఈ షాకింగ్ ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. భార్యాభర్తలైన ఇద్దరు  ఏజెంట్లు.. భద్రాచలం ఎల్ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో సినీ ఫక్కీలో భారీ మోసానికి పాల్పడి కోట్లు కొట్టేశారు. వివరాల ప్రకారం.. అశ్వాపురం మండలానికి చెందిన అలువాల వెంకటేశ్వర్లు లో జోనల్ క్లబ్ మెంబర్ గా ఉండగా.. అతని భార్య సరస్వతి ఏజెంటుగా పని చేస్తుంది. ఇక వీరిద్దరూ నిరుపేదలు, అమాయకులను ఆసరాగా చేసుకొని అశ్వాపురం సీతారాంపురం, నెల్లిపాక బంజర ప్రాంతాల్లో  పాలసీలు కట్టిచ్చారు.. అయితే.. వారు బతికుండగానే 39 మంది నకిలీ మరణ ధృవీకరణ పత్రాలను సృష్టించి.. ఏకంగా రూ. 1.52 కోట్లను కాజేశారు ఈ కేటుగాళ్లు.బతికున్న వ్యక్తులను చనిపోయినట్లుగా చిత్రీకరించి, గ్రీన్ ఇంకుతో గెజిటెడ్ సంతకాలు పెట్టి, నకిలీ పత్రాలతో క్లెయిమ్‌లు పొందిన ఈ ఘరానా మోసం స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. క్షేత్రస్థాయిలో విచారణ చేయాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో, ఈ కేటుగాళ్లు సులభంగా కోటిన్నర రూపాయలకు పైగా సొమ్మును డ్రా చేసుకున్నారు.అయితే.. అంతర్గత తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడటంతో భద్రాచలం  బ్రాంచ్ మేనేజర్ చక్రవర్తి భద్రాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇంత భారీ మొత్తంలో నగదు పక్కదారి పడుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు గుర్తించలేకపోయారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.భద్రాచలం బ్రాంచ్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో పాలసీదారుల్లో ఆందోళన మొదలైంది. బ్రాంచ్ అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ జరగడం సాధ్యమేనా? నకిలీ పత్రాలను వెరిఫై చేయడంలో సిబ్బంది ఎందుకు విఫలమయ్యారు? సాధారణ ప్రజలకు క్లెయిమ్ రావాలంటే నెలల తరబడి తిప్పించే అధికారులు, ఈ కేటుగాళ్లకు ఎలా సహకరించారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వ సంస్థలో ఇలాంటి ఘరానా మోసాలు చోటుచేసుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!