EPAPER
Sunday, March 15, 2026
Google search engine

యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్.

📰 Generate e-Paper Clip

యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్.

పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ రక్తం ఇంజెక్ట్ చేసిన యువకుడు.

– పోచారంలో దారుణ ఘటన.
– వివాహం నిరాకరించడంతో కక్ష తీర్చుకున్న నిందితుడు.
– నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 14:

హైదరాబాద్ నగర పరిధిలోని పోచారం ప్రాంతంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు యువతిపై దారుణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. యువకుడు మనోహర్ అనే వ్యక్తి యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, బాధిత యువతికి మనోహర్‌తో వివాహం నిశ్చయమైంది. అయితే అనంతరం మనోహర్‌కు ఎయిడ్స్ ఉన్నట్లు యువతికి తెలిసింది. దీంతో ఆమె ఆ వివాహానికి నిరాకరించినట్లు సమాచారం. ఈ విషయం మనోహర్‌కు ఆగ్రహం కలిగించడంతో యువతిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లిన మనోహర్, మరోసారి పెళ్లి విషయంపై మాట్లాడే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. యువతి మరోసారి వివాహానికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన మనోహర్ ఆమెకు ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, బాధిత యువతికి వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!

Subscribe