కరీంనగర్ జాగృతి అధ్యక్షురాలి ఆధ్వర్యంలో ఛలో హైదరాబాద్.
జనం వాయిస్, కరీంనగర్, ఏప్రిల్ 25:
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నూతన పార్టీ ఆవిర్భావం సందర్భంగా జాగృతి మహిళా విభాగం అధ్యక్షురాలు అంకం శివాణి ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణం నుండి అధిక సంఖ్యలో మహిళలు తరలి వెళ్లారు. బడుగు, బలహీనవర్గాలకు, మహిళల అభ్యున్నతే ధ్యేయంగా అనగారిన ప్రజల జీవన ప్రగతి కొరకు నూతన శక్తిగా కవితక్క పార్టీ అవతరిస్తుందని అన్నారు. మహిళలందరూ తెలంగాణలోని సబ్బండ వర్గాలన్ని ముక్తకంఠంతో కవితక్క నాయకత్వాన్ని బలపరుస్తూ జై కవితక్క అంటూ నినాదిస్తూ అధిక సంఖ్యలో హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments