EPAPER
Friday, July 10, 2026
Google search engine

బాలయ్య చిత్రంలో కాజల్ పాత్రపై ఆసక్తి..

📰 Generate e-Paper Clip

బాలయ్య చిత్రంలో కాజల్ పాత్రపై ఆసక్తి..

జనం వాయిస్, జూలై 10, సినిమా:

టాలీవుడ్ స్టార్ కథానాయిక కాజల్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. మహిళా ప్రాధాన్య చిత్రాలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్న ఆమె, ఇప్పుడు మరోసారి నందమూరి బాలకృష్ణతో జతకట్టనుంది. ఇప్పటికే ‘భగవంత్ కేసరి’ చిత్రంలో బాలయ్య సరసన నటించిన కాజల్, ఇప్పుడు ఆయన 111వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఎన్‌బీకే 111’లో కీలక పాత్ర పోషిస్తోంది.
ఇటీవల చిత్ర బృందం విడుదల చేసిన కాజల్ తొలి ప్రచార చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇదే సమయంలో సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్రపై పలు ఆసక్తికర వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముంబై నేర పరిశోధన విభాగం అధికారిణిగా కాజల్ కనిపించనున్నట్లు, కథలో కీలక మలుపులు తిప్పే బాధ్యత ఆమె పాత్రదేనని ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజల్ అగర్వాల్ తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రంలో తన పాత్ర సరదాగా ఉండదని, పూర్తిగా గంభీర స్వభావంతో సాగుతుందని వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు వినిపిస్తున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. గ్లామర్, ప్రేమకథా పాత్రలతో గుర్తింపు పొందిన కాజల్ ఈసారి పూర్తిగా భిన్నమైన, భావోద్వేగాలతో కూడిన పాత్రలో కనిపించనున్నట్లు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కాజల్ వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో మరో చర్చ మొదలైంది. సినిమాలో బాలకృష్ణ, కాజల్ పాత్రల మధ్య బలమైన సంఘర్షణ ఉండే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ ఆమె నిజంగానే నేర పరిశోధన విభాగం అధికారిణి పాత్రలో కనిపిస్తే, బాలయ్యతో ఆమె మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంచనా వేస్తున్నారు.
అయితే కాజల్ పాత్రకు సంబంధించి చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు. దీంతో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ‘ఎన్‌బీకే 111’ మాస్ యాక్షన్ కథాంశంతో రూపొందుతుండగా, ఇందులో బాలకృష్ణను మరో శక్తివంతమైన పాత్రలో చూపించనున్నట్లు సమాచారం.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!