EPAPER
Sunday, March 22, 2026
Google search engine

పత్తిచేనులో పసికందు.

📰 Generate e-Paper Clip

పత్తిచేనులో పసికందు.

జనం వాయిస్, ఆసిఫాబాద్:

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగ జ్ నగర్ మండలం వల్లగొండ గ్రామపంచాయతీ సీతానగర్ శివారులో పత్తి చేనులో పసికందును గుడ్డలో కట్టి పడేసిన ఘటన శనివారం కలకలం రేపింది. స్థానికులు ఉదయం పత్తి చేను వైపు వెళ్లగా శిశువు అరుపు వినిపించింది, అటు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వెంటనే అక్కడకి చేరుకొని చేనులో సంచిలో చుట్టి పడేసి ఉన్న ఆడ శిశువును సురక్షితంగా బయటకు తీసి  కాగ జ్ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందించారు.
విషయాన్ని బాల సంరక్షణ అధికారి మహేశ్ కి తెలపడంతో సిబ్బందితో ఆయన చేరుకొని ఒక రోజు వయసున్న శిశువును బాల సంరక్షణ కేంద్రానికి తరలించారు.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. కన్నపేగు బంధాన్ని తెంచుకుని కసాయిగా మారిన తల్లి ఆమె కుటుంబీకులను కర్కశత్వాన్ని  ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు…


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!